![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -148 లో... మహా హాస్టల్ లో అందరు నారాయణ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడింది గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది. మరుసటిరోజు నారాయణ ఇంటికి ఇద్దరు ఆడవాళ్లు వచ్చి.. మేం ఈ వీధిలోకీ కొత్తగా వచ్చాము.. మా కోడలు శ్రీమంతం ఉంది పిలవడానికి వచ్చాము.. మీ ఇంట్లో ఆడవాళ్లు ఉంటే పిలవండి అని అంటారు. అప్పుడే మాధవ, కన్నా, కేశవ బయటకు వస్తారు. పిలవండి అని వాళ్ళు అంటారు. ఏం పిలుస్తారు ఉంటే కదా.. పిలవడానికి అని తాయారు ఇంకా వాళ్ళ అన్నయ్య ఎంట్రీ ఇస్తారు. వాళ్ళింట్లో మగవాళ్ళు మాత్రమే ఉంటారని తాయారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది.
అప్పుడే మహా లోపల నుంచి హారతి పట్టుకొని వస్తుంది. అందరు షాక్ అవుతారు. అందరికి హారతి ఇస్తుంది. వాళ్ళు మహాకి బొట్టు పెట్టి ఆహ్వానిస్తారు. ఇంత లక్షణంగా ఉంది.. ఆడవాళ్లు లేరు అన్నారని వచ్చిన వాళ్ళంతా తాయారుతో అంటారు. పేరంటానికి ఖచ్చితంగా రా అమ్మ అని వాళ్ళు చెప్పగానే మహా వస్తానని చెప్తుంది. నీ కూతురు అప్పుడప్పుడు మా పెద్దోడికి ఫోన్ చేస్తుంది చూసుకోమని నారాయణ అనగానే తాయారు కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత అందరు ఇంట్లోకి వెళ్తారు. ఎలా వచ్చావని అడుగుతాడు. ఇప్పుడే వాళ్ళని చూసి వెనకాల డోర్ నుంచి వచ్చాను. నా వల్ల మీ కుటుంబం మాటలు పడకూడదని తిరిగి వచ్చానని మహా అంటుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మహా గదిలోకి వెళ్తుంది. మహాని చూసుకోకుండా చక్రి గదిలోకి వెళ్తాడు. తను వచ్చిన విషయం చక్రికి తెలియదు. తన బెడ్ చూస్తూ పొగరు బాగా.. అసలు క్షమించడం లేదని చక్రి తిట్టుకుంటాడు. ఆ తర్వాత మహాని చక్రి చూసి అంతా భ్రమ అనుకుంటాడు. మరోవైపు శైలు, కేశవ కలుసుకుంటారు. కేశవ చాలా హ్యాపీగా ఉంటాడు. నా వల్లే కదా అని శైలు అనగానే లేదు మా వదిన వల్ల అని మహా గురించి గొప్పగా చెప్తాడు. నా వల్ల కాదా అని శైలు కోపంగా అలిగి వెళ్తుంది. ఆ తర్వాత రాత్రి అందరు భోజనానికి కూర్చొని ఉంటారు.
మహాని చూసి మళ్ళీ భ్రమ అనుకుంటాడు చక్రి కానీ ఆ తర్వాత మహా వచ్చిన విషయం తెలుస్తుంది. ఆ మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటేనే నేను వచ్చానని మహా ఆటపట్టిస్తుంది. వెళ్తానులేండి అని చక్రి అంటాడు. ఆ తర్వాత శైలుకి ఏం మెసేజ్ చెయ్యాలో కేశవ ఆలోచిస్తాడు. ఇంకా ఏం మెసేజ్ చెయ్యట్లేదని శైలు వెయిట్ చేస్తుంది. కేశవ దగ్గరికి మహా వచ్చి లవ్వా అని అడుగుతుంది. అప్పుడే చక్రి వచ్చి అవును అండి.. నాకు వీడి అసిస్టెంట్ మొత్తం చెప్పాడని చక్రి అంటాడు. తను ప్రేమిస్తున్నాను అంది.. నేను ఒకే అన్నానని కేశవ చెప్తాడు. అమ్మాయి ఫోన్ మాట్లాడినప్పుడు విన్నా చాలా మంచిది వదులుకోకు అని మహా చెప్తుంది. తరువాయి భాగంలో మహాని హారిక కలిసి చక్రితో విడాకులు తీసుకోమని చెప్తుంది. అదే విషయం చక్రితో మహా చెప్పగానే అతను షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |